జ్యోతిష్యం:  ఫిబ్రవరి 23 పంచగ్రహకూటమి.. ఆదిత్య మంగళయోగం ఎఫెక్ట్ .. ఆరు రాశుల వారికి గోల్డెన్ టైమ్ వచ్చేసింది..! 

జ్యోతిష్యం:  ఫిబ్రవరి 23 పంచగ్రహకూటమి.. ఆదిత్య మంగళయోగం ఎఫెక్ట్ .. ఆరు రాశుల వారికి గోల్డెన్ టైమ్ వచ్చేసింది..! 

జ్యోతిష్య శాస్త్రం   నక్షత్రాలు.. రాశుల ఆధారంగా గ్రహాల కదలికలను బట్టి పండితులు చెబుతుంటారు.   ఈ గ్రహాలు తరచూ ఒక రాశి నుంచి మరోరాశిలోకి మారినప్పుడు జీవుల జీవనంపై ప్రభావం పడుతుందని నమ్ముతుంటారు.  కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడుతాయి.    నవ గ్రహాలకు అధిపతి అయిన కుజుడు  ఈ ఏడాది 23 ఫిబ్రవరి 2026 ఉదయం 11:49 గంటలకు  కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. అప్పటికే  సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువులు కుంభంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాలతో కుజుడు కలిసి  పంచగ్రహి యోగాన్ని ఏర్పరచనున్నాయి. కుంభరాశిలో కుజుడు ఏప్రిల్​ 2 వ తేదీ వరకు సంచరిస్తాడు. జ్యోతిష్య ప్రకారం కుజుడు, సూర్యుడి కలయికతో ఆదిత్య మంగళ యోగం ఏర్పడనుంది.   దీని ప్రభావం వలన ఆరు రాశుల వారికి రాజయోగం ఏర్పడుతుందని.. ( మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ )  వారికి అన్ని విధాలా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. . . 

మేష రాశి: ఈ రాశివారికి  కుజుడు పదకొండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది.  సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కలుగుతుందదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ALSO READ : ఆమ్ల ఏకాదశి పూజ.. ఆరోగ్యం.. సంపద .. మోక్షం..కలుగుతుంది... 

వృషభరాశి: ఈ రాశి నుంచి కుజుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. కుజుడు .. సూర్యుడు కలవడం వలన ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు  కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.  సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. . నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి.

మిథున రాశి .. ఈ రాశి వారికి  కుజుడి ప్రభావంతో తాము చేసే పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు.ఈ కాలంలో భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కెరీర్ పరంగా మీకు మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే బలమైన అవకాశం ఉంది. మీ పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలొస్తాయి. కొంతకాలంగా ఎదురవుతున్న కష్టాలకు ఇప్పుడు ముగింపు దశ ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. వృత్తి పరంగా చేసిన ప్రయత్నాలు ఫలించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల లాభాలు పొందే పరిస్థితి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. 

 తుల రాశి: ఈ రాశి వారికి ధన, సప్తమాధిపతి అయిన కుజుడు పంచమ స్థాన ప్రవేశం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో తప్ప కుండా అధికార లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వృత్తి .. వ్యాపారస్తులకు ఆదాయం భారీగా పెరుగుతుంది.ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. అనేక విధాలుగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.  పెళ్లికోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.

వృశ్చిక రాశి.. కుజుడు.. సూర్యుడు కలవడం వలన ఈ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే వ్యక్తులకు కలిసి రాబోతోంది. ఉద్యోగాల్లో మెరుగుదల కనిపించడమే కాకుండా పనులన్నీ ఎంతో సులభంగా పూర్తి చేయగలుగుతారు.. కొత్త ఆదాయం మార్గాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సృష్టిస్తారు.న్యాయపరమైన వ్యవహారాలు, అధికార సంబంధిత పనులు లేదా ఇతర సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. 

కుంభ రాశి.. ఇదే రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. కుజుడు.. సూర్యుడు ఇదే రాశిలో కలవడం వలన ఈ రాశికి చెందిన వారి వ్యక్తిత్వ జీవితం మెరుగుపడుతుంది. ఆరోగ్య రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.లగ్నంలోనే ఐదు  గ్రహాలు ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. అదృష్టం అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులకు ఈ కాలం ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది.  చాలా రోజులుగా ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరిగి ఖర్చులపై నియంత్రణ సాధించే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణంలో సానుకూల మార్పులు కనిపించి ఆనందం పెరుగుతుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.